
గమనిక: అన్ని సమయాలు New Delhi, India స్థానిక సమయంలో 12 గంటల విధానంలో డి.ఎస్.టి సర్దుబాటు (వర్తిస్తే) తో చూపబడ్డాయి.
అర్ధరాత్రి తరువాతి సమయాలు మరుసటి రోజు తేదీని ప్రత్యయంగా జోడించి చూపబడ్డాయి. పంచాంగంలో రోజు సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతోనే ముగుస్తుంది.
శరన్నవరాత్రి అన్ని నవరాత్రులలోకెల్లా అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ప్రాముఖ్యమైన నవరాత్రి. అందుకే శరన్నవరాత్రిని మహా నవరాత్రి అని కూడా అంటారు.
ఇది చాంద్రమాన ఆశ్వయుజ మాసంలో, శరదృతువులో వస్తుంది. శరదృతువులో వచ్చే కారణంగా దీనికి శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. నవరాత్రి తొమ్మిది రోజులు ఆదిశక్తి దేవి యొక్క తొమ్మిది రూపాలకు అంకితం చేయబడ్డాయి. శరన్నవరాత్రి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవం పదవ రోజైన దసరా లేదా విజయదశమితో ముగుస్తుంది.
నవరాత్రి తొమ్మిది రోజులలో, ముఖ్యంగా మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో, మహిళలు తొమ్మిది విభిన్న రంగుల దుస్తులు ధరిస్తారు. ఈ రంగు ఆ రోజు వారం ఆధారంగా నిర్ణయించబడుతుంది. వారంలోని ప్రతి రోజు ఒక గ్రహం లేదా నవగ్రహంచే పాలించబడుతుంది కాబట్టి, ఆ గ్రహానికి అనుగుణంగా ప్రతి రోజుకు ఒక రంగు కేటాయించబడుతుంది.
నవదుర్గ యొక్క ప్రతి అవతారం దుర్గాదేవి యొక్క ఒక ప్రత్యేక లక్షణాన్ని సూచిస్తుంది. ఆమె ఆశీర్వాదం పొందేందుకు ప్రతి రోజు నవదుర్గకు ఒక ప్రత్యేక ప్రసాదం సమర్పించబడుతుంది. నవదుర్గ యొక్క తొమ్మిది రూపాలకు నవరాత్రి సమయంలో సమర్పించే తొమ్మిది ప్రత్యేక నవరాత్రి ప్రసాదాల గురించి తెలుసుకోండి.
మహా నవరాత్రి సమయంలో జరిగే దుర్గా పూజ క్యాలెండర్ పై కూడా మీకు ఆసక్తి ఉండవచ్చు.